భారత్-ఆఫ్గన్ మధ్య మ్యాచ్ జరిగే మొహాలీ వాతావరణంపై భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇక్కడి చలి వాతావరణంలో బౌలింగ్ ఓ పెను సవాల్, ఫీల్డింగ్ చేయడమూ ఇబ్బందే. బంతిపై నియంత్రణ ఉండదు. బ్యాటింగ్, బౌలింగ్ కంటే ఫీల్డింగ్ చాలా కఠినంగా మారనుంది. దానిని ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యాం. బౌలింగ్‌లో నూరుశాతం మా ప్రణాళికలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తేనే మ్యాచ్‌లో రాణించగలం’ అని తెలిపాడు.