దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగి 72,008 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 76 పాయింట్లు బలపడి 21,723 వద్దకు చేరింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.08 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.