సాధారణంగా ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సింది మంచి ఆహారం, మంచి నిద్ర. ఈ రెండు లేకుంటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. రాత్రి భోజనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
రాత్రి పూట ఫ్రై చేసిన ఆహారాన్ని తీసుకోకూడదు. చీజ్ బర్గర్లు, పుల్లటి పండ్లు అస్సలు తినకూడదు. అలాగే టీ, కాఫీలు తాగవద్దని సూచిస్తున్నారు. వీటిని తీసుకుంటే నిద్రలేమి, జీర్ణ సమస్యలు, అధిక బరువు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.