టీమిండియా పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ గాయం పాలైనట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీలో కర్ణాటక తరఫున ఆడుతున్న ప్రసిద్ధ్.. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొడ కండరాల నొప్పితో బాధపడినట్లు సమాచారం. స్కానింగ్ కోసం ప్రసిద్ధ్‌ను ఆస్పత్రికి తరలించగా.. కనీసం నెలన్నర రోజులు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారట. దీంతో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ప్రసిద్ధ్ దూరం అయ్యే అవకాశముంది.