భారత్-ఇంగ్లండ్ మధ్య ఈనెల 25 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. అయితే, తొలి రెండు టెస్టులకు ఉత్తర్ప్రదేశ్ ఆటగాడు ధ్రువ్ జురెల్ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. టీమిండియాకు తొలిసారి ఎంపికైన అనంతరం జురెల్ స్పందించాడు.‘‘నాకు బ్యాట్ కొనివ్వడానికి నాన్న రూ.800 అప్పు చేశాడు. క్రికెట్ కిట్టు కావాలని నేను మొండిపట్టు పట్టడంతో అమ్మ తన మెడలోని బంగారు గొలుసుని అమ్మింది’’అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.