ఆఫ్గనిస్తాన్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు దూరమైన విరాట్ కోహ్లి ఇవాళ జరిగే రెండో మ్యాచ్‌కి అందుబాటులోకి వచ్చాడు. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్లో తొలి టీ20 ఆడేందుకు కోహ్లి సిద్ధమయ్యాడు. అయితే కోహ్లి రాకతో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కెరీర్‌ను గొప్పగా ఆరంభించిన తిలక్ ఆ తర్వాత తడబడుతున్నాడు. గత 13 ఇన్నింగ్స్‌లో అతను ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేదు.