ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఎలక్ట్రానిక్ పరికరానికి ఛార్జింగ్ అనేది చాలా ముఖ్యం. అయితే ఎటువంటి ఛార్జింగ్ అవసరం లేకుండా 50 ఏండ్లు శక్తిని ఉత్పత్తి చేసే బ్యాటరీని చైనాలో తయారు చేయనున్నారు.
బీజింగ్‌కు చెందిన బీటావోల్ట్ అనే ఓ స్టార్టప్ కంపెనీ ఓ న్యూక్లియర్ బ్యాటరీని అభివృద్ధి చేస్తోంది. నికెల్-63 ఐసోటోప్, డైమండ్ సెమీ కండక్టర్‌లతో తయారు చేస్తున్నారు. 3 వోల్టుల వద్ద ఇది 100 మైక్రోవాట్ల శక్తిని విడుదల చేస్తుందని తెలిపారు.