తులసి ఆకులతో చేసిన టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒత్తిడి తగ్గించడం సహా రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఉబ్బసం, అలర్జీ వంటి వాటిని నివారిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి, ఉదర సంబంధ సమస్యలు తగ్గిస్తుందంటున్నారు. బీపీని అదుపులో ఉంచడం సహా గుండె జబ్బులను నివారిస్తుందని చెబుతున్నారు. జ్ఞాపక శక్తి పెంచడం సహా మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుందంటున్నారు.