అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 706 పాయింట్లు నష్టపోయి 72,422 ట్రేడవుతోంది. నిఫ్టీ 199 పాయింట్లు తగ్గి 21,833 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.14 దగ్గర ప్రారంభమైంది.సెన్సెక్స్-30 సూచీలో భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.