బంగారం నిల్వలు దేశ ఆర్థిక స్థిరత్వానికి చాలా కీలకం. ప్రతిదేశం ఎంతో కొంత బంగారాన్ని నిల్వ చేసి పెట్టుకుంటాయి. వీలున్నప్పుడల్లా వాటిని పెంచుకుంటాయి. దేశ కరెన్సీ విలువను కూడా బంగారం నిల్వలు ప్రభావితం చేస్తాయి. అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. అమెరికా మొదటి స్థానంలో ఉంది.