నానబెట్టిన గోధుమలకు అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగించే శక్తి ఉందని డైటీషియన్లు చెబుతున్నారు. గోధుమలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. వీటిని తినడం ద్వారా అధిక శరీర బరువు తగ్గుతుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అదనంగా, గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.