భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన్న చరిత్ర సృష్టించాడు. 43 ఏళ్ల వయసులో టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో వరల్డ్ నెంబర్.1 ర్యాంక్‌ను సాధించాడు.
అత్యంత వృద్ధ వయసులో ఈ ర్యాంక్ సాధించిన టెన్నిస్ ప్లేయర్‌గా బొప్పన్న నిలువనున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ ముగిసిన తర్వాత రిలీజ్ చేసే ర్యాంకుల్లో బొప్పన్న ఈ ఘనత అందుకోనున్నాడు.