చాలామంది అమ్మాయిలు పెళ్లయిన తర్వాత బరువు విపరీతంగా పెరుగుతారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. పెళ్లైన కొత్తలో అమ్మాయిలకు కొంచెం సౌకర్యవంతమైన జీవితం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులతో విందులు వినోదాలలో పాల్గొంటారు. ఇక నాన్ వెజ్, స్పైసీ ఫుడ్ తింటారు.బరువు పట్టింపు లేనట్టు ఆహారం తీసుకోవటం, ఈ సౌకర్యవంతమైన జీవితం అమ్మాయిలు బరువు పెరగడానికి కారణం అవుతుందని తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది.