సెక్యూరిటీ కళ్లు గప్పి శనివారం ఉప్పల్ స్టేడియంలోకి దూసుకెళ్లి రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన యువకుడు హర్షిత్ రెడ్డి(20)ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అతనికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. బారికేడ్స్ దాటి అభిమాని దూసుకెళ్లడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. ప్రేక్షకులు వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని హెచ్చరిస్తున్నారు.