భారత జట్టు అభిమానులకు గుడ్ న్యూస్. కాలి మడమ గాయం నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించాడు. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. బరోడా క్రికెట్ స్టేడియంలో పాండ్యా నెట్స్‌లో చెమటోడ్చాడు. బౌలింగ్ చేస్తున్న వీడియోను పాండ్యా షేర్ చేశాడు. ‘ప్రతి రోజు నా శక్తినంతా ధారపోస్తున్నా’ అని ఆ వీడియోకు పాండ్యా క్యాప్షన్ రాశాడు.