ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారు కొంటున్నారా? ఈ 20/10/4 రూల్ పాటిస్తేనే కొనండి.. లేదంటే నష్టపోతారు

business |  Suryaa Desk  | Published : Sun, Jan 28, 2024, 09:15 PM

కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇప్పుడు మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా కంపెనీలు వివిధ రకాల మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అదనపు ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంఛ్ చేస్తున్నాయి. అయితే, ప్రస్తుత రోజుల్లో కారు కొనడం అంటే అంత సులభమైన విషయమేమీ కాదు. కార్ల ధరలు భారీగా పెరిగాయి. ప్రీమియం కార్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే, బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు కారు రుణాలు అందిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులకు సులభంగా మారిపోయింది. నెల నెలా వాయిదాలు చెల్లిస్తే కొత్త కారు తమ సొంతమవుతోంది. అయితే, ఇలా లక్షల్లో అప్పు తీసుకుని కారు కొనడం అనేది అప్పుల ఊబిలో కూరుకుపోయేందుకు కారణం కావచ్చు. ఇలా లోన్ తీసుకుని కారు కొనాలనుకునే వారు కచ్చితంగా 20/10/4 రూల్ తెలుసుకోవాలి. ఈ రూల్ పాటిస్తే కారు లోన్ అనేది భారంగా మారదు. అది ఎలాగో తెలుసుకుందాం.


ఏమిటీ 20/10/4 రూల్?


బ్యాంకులో రుణం తీసుకుని కారు కొనుగోలు చేయాలనుకునే వారు తమ బడ్జెట్‌ను నిర్ణయించుకునేందుకు కొన్ని నియమాలు సాయపడతాయి. అందులో కీలకమైంది 20/10/4 రూల్. ఈ రూలు ప్రకారం.. కారు ఆన్ రోడ్ ప్రైస్‌లో 20 శాతం డౌన్‌ పేమెంట్‌గా మీ సేవింగ్స్ నుంచే చెల్లించాలి. మీ నెలవారీ ఈఎంఐ అనేది మీ నెల వారీ ఆదాయంలో 10 శాతానికి మించకుండా చూసుకోవాలి. అలాగే రుణం రీపేమెంట్ టెన్యూర్ గరిష్ఠంగా 4 ఏళ్లలోపే ఉండాలి. ఈ విధంగా మీ బడ్జెట్‌ను రూపొందించుకుంటే.. కారు లోన్ చెల్లించడం సులభమవడమే కాకుండా ఇతర ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది.


పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి


ఉదాహరణతో తెలుసుకుందాం..


మీ జీతం నెలకు లక్ష రూపాయలు వస్తుందనుకుందాం. మీ వార్షిక ఆదాయం రూ.12 లక్షలుగా ఉంటుంది. మీరు కొత్త కారు కోనుగోలు చేయాలనుకుంటే ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. కారు ఆన్ రోడ్ ప్రైస్ రూ. 6 లక్షల లోపే ఉండాలి. కారు కొనుగోలు విలువలో 20 శాతం రూ.1.2 లక్షలు మీరు డౌన్ పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రూ.4.8 లక్షలు బ్యాంకు లేదా ఫైనాన్షియల్ సంస్థ ద్వారా లోన్ తీసుకోవచ్చు. అలాగే నెల వారీ ఈఎంఐ రూ.10 వేల వరకు ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం బ్యాంకులు 7.5 - 8 శాతం వరకు వడ్డీ రేటుతో కారు లోన్లు ఇస్తున్నాయి. కాబట్టి 4 ఏళ్ల టెన్యూర్ ఎంచుకోవాలి. రూ.4.8 లక్షల లోన్‌ని 8 శాతం వడ్డీ రేటుతో చూసుకుంటే 4 ఏళ్ల టెన్యూర్ ఎంచుకున్నప్పుడు ఈఎంఐ రూ.11 వేల వరకు ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com