నేడు దక్షిణాఫ్రికాలో అండర్-19 ప్రపంచకప్లో భాగంగా ఇండియా, అమెరికా జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా 201 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అమెరికా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇండియా అండర్-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. ఇండియా ఓపెనర్ అర్షిన్ కులకర్ణి 108 పరుగులు చేసాడు, ముషీర్ ఖాన్ 73 పరుగులు, కెప్టెన్ ఉదయ్ సహారన్ 35 పరుగులు, ప్రియాంషు మోలియా 27 పరుగులు, సచిన్ దాస్ 20 పరుగులు, ఆదర్శ్ సింగ్ 25 పరుగులు చేశారు. అమెరికా బౌలర్లలో అతింద్ర సుబ్రమణియన్ 2 వికెట్లు, ఆర్య గార్గ్ 1, అరిన్ నాద్ కర్ణి 1, కెప్టెన్ రిషి రమేశ్ 1 వికెట్ తీశారు. అనంతరం 327 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసింది.