అండర్-19 వరల్డ్ కప్ గ్రూపు దశ ముగిసింది. బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికాలపై హ్యాట్రిక్ విజయాలను సాధించిన టీమిండియా సూపర్ సిక్స్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నేడు న్యూజిలాండ్‌తో పోటీ పడనుంది. కాగా, తెలుగు కుర్రాడు దేవిరెడ్డి స్నేహిత్ రెడ్డి కివీస్ తరపున ఆడుతుండటం విశేషం. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.