చాలా మంది టెన్షన్ గా ఉన్నపుడు టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే టెన్షన్ పోగొట్టడంలో ‘మాచా’ టీ బెస్ట్ ఫలితాన్ని ఇస్తుందట. దీనిని ఎక్కువగా జపనీస్ తాగుతూ ఉంటారు. మాచీ ఆకుల పొడిని అనేక రకాల మందుల తయారీలో వాడుతారు. అయితే దీంట్లో టెన్షన్ తగ్గించే గుణం ఉందని జపాన్లోని కుమార్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఈ టీ తీసుకుంటే ఒత్తిడి తగ్గి యాక్టివ్ అవుతారట. అంతేకాకుండా ఈ టీ శరీరంలో ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.