ప్రస్తుతం చాలా చోట్ల నెలలు నిండకుండానే పిల్లలు పుడుతున్నారు. ఇలాంటి వారిని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. నెలలు నిండకుండా పుట్టడంతో వారు చాలా వీక్‌గా,
తక్కువ బరువుతో ఉంటారు. అలాంటి శిశువులు అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రీమెచ్యూర్ వల్ల వీరి శరీరం, ఆర్గాన్స్ అభివృద్ధి చెందకపోవచ్చు. కాబట్టి వారిలో న్యూరో డెవలప్‌మెంట్ అనేది అసాధారణంగా ఉంటుంది.