మరికాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 గంటల సమయంలో సెన్సెక్స్ 48 పాయింట్లు లాభపడి 71,800 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ లో టాటా మోటార్స్, మారుతీ, ఎం అండ్ ఎం, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ 14 పాయింట్లు పెరిగి 21,739 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే భారత రూపాయి విలువ రూ.83.02 వద్ద స్థిరంగా ప్రారంభమైంది.