విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2నుంచి ఇంగ్లండ్తో రెండో టెస్టుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఇదే సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్కు అవకాశం ఇవ్వాలన్నాడు. సర్ఫరాజ్ ఖాన్కు దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉందని, ఐదో స్ధానానికి సరిపోతాడని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.