భారతదేశం వేలాది ఆలయాలకు నిలయం. ఒక్కో ఆలయంలో ఒక్కో సంప్రదాయం, ప్రత్యేకత ఉంటుంది. అలానే రాజస్థాన్ లోని డౌస జిల్లాలోని మహేందిపుర్ బాలాజీ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది.
ఈ ఆలయంలో భక్తులకు ప్రసాదం ఇవ్వరు. ఎందుకంటే ఈ ఆలయంలో భూతవైద్యం చేస్తారు. అందుకే ఆలయంలో ప్రసాదాన్ని ఇవ్వరు. ఆలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు భక్తులు వెనక్కి తిరిగి చూడకూడదని చెబుతారు. ఎందుకంటే దుష్టశక్తులు దీనిని ఆహ్వానంగా తీసుకుని శరీరంలోకి ప్రవేశిస్తాయని నమ్ముతారు.