చలికాలంలో మలబద్ధకాన్ని నివారించే చిట్కాల గురించి తెలుసుకుందాం.! ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే మంచిది.అవిసె గింజలు తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చియా విత్తనాలు,అల్లం, వెచ్చని ద్రవాలు,పెరుగు, డ్రై ఫ్రూట్స్, ఆకు కూరలు వంటివి తీసుకుంటే చలికాలంలో మలబద్దకాన్ని నివారించేందుకు ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వీటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదట: సాధారణంగా మనందరి ఇంట్లో ఫ్రిజ్ ఉంటుంది. మనం కూరగాయలు, పండ్లు, ఇతర ఆహారాన్ని ఫ్రిజ్‌లోనే నిల్వ చేస్తాం. అయితే అన్ని ఆహారాలను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. వాటిలో అన్నం, వెల్లుల్లి, టమాటో, ఉల్లిపాయలు, అల్లం లాంటి పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచితే విషపూరితం అవుతుందన్నారు.