ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రికెటర్ గిల్ ఇంగ్లాండ్తో రెండో టెస్టులో సెంచరీ ద్వారా మళ్లీ టచ్ లోకి వచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో గిల్ 147 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 104 పరుగులు చేశాడు.
గిల్ సెంచరీపై సచిన్ టెండుల్కర్ స్పందించాడు. "సరైన సమయంలో సెంచరీ కొట్టినందుకు శుభాభినందనలు. ఈ ఇన్నింగ్స్ లో గిల్ బ్యాటింగ్ పూర్తి నైపుణ్యంతో కొనసాగింది" అంటూ కొనియాడారు.