పరీక్షల సమయంలో పిల్లల ఒత్తిడి తగ్గించేందుకు జాగ్రత్తలు పడాలి. నిరంతరం వాళ్లు స్టడీరూమ్ కే అంకితం అవ్వకుండా మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. వాళ్లతో పేరెంట్స్ స్నేహాపూర్వకంగా మాట్లాడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వారు ఏ విషయాన్నైనా మీతో పంచుకోగలుగుతారు. రోజూ యోగా, పజిల్స్, వంటివి చేయిస్తే పిల్లల మెదడు చురుకుగా ఉంటుంది.