దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 154.47 పాయింట్లు లాభపడి 72,340.56 వద్ద, నిఫ్టీ 53.75 పాయింట్ల లాభంతో 21,983.15 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో HDFC లైఫ్, ఎస్బీఐ, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు రాణిస్తుండగా.. భారత్ పెట్రోలియం, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.