మనిషికి నిద్ర ఎంతో అవసరం. ప్రశాంతంగా నిద్రపోయేందుకు అందరూ ఇష్టపడతారు. చాలామంది తల కింద దిండు పెట్టుకోకుండా నిద్రపోవడం అలవాటు. అలా నిద్రపోయే వారికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దిండు లేకుండా నిద్రపొతే వెన్ను నొప్పి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు మొటిమల సమస్య కూడా దిండు పెట్టుకోకుండా నిద్రపోవడం వలన తగ్గుతుందని చెబుతున్నారు.
మౌత్ వాష్ వాడుతున్నారా: ఉదయాన్నే ప్రతిరోజూ చాలా మందికి మౌత్ వాష్ వాడటం అలవాటు ఉంటుంది. మౌత్‌వాష్‌లోని రసాయనాల వలన నోటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మౌత్ వాష్ వాడకం వలన దురద, చికాకు వంటి పలు సమస్యలను కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రసాయనాలతో తయారు చేసేవి కాకుండా, సహజసిద్ధమైన మౌత్ వాష్ ను వాడటం మంచిదని సూచిస్తున్నారు.