మనం రెస్టారెంట్ కి అప్పుడప్పుడు పోతూ ఉంటాము. అక్కడ భోజనం చేయడానికి వెళ్లాలంటే డైనింగ్ నియమాలు తెలిసి ఉండడం అవసరం. టేబుల్ పైన ఫోన్, తాళాలు, పర్సు లాంటివి ఉంచకూడదు. ఆతిధ్యం ఇస్తున్నది మీరైతే ముందే బిల్ చెల్లించడం మంచిది. ముఖ్యంగా ఆర్డర్ చేసే అవకాశం అతిథికే ఇవ్వాలి. వెయిటర్ మీద కోపగించుకోవడం లాంటివి చేయకూడదు. మనం మాట్లాడుకునేటప్పుడు సంభాషణ మృదువుగా ఉండేలా చూసుకోవాలి. తినేటప్పుడు న్యాప్కిన్స్ ను ఒళ్లో ఉంచుకోవాలి.