రిషబ్ పంత్ ఐపీఎల్ ఆడతాడనే నమ్మకం ఉంది అని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ అన్నారు. ’’యాక్సిడెంట్ నుంచి కోలుకున్న పంత్ క్రికెట్ సాధన చేస్తున్నాడు. తొలి మ్యాచ్ మరో ఆరు వారాల్లో ఉంది. కాబట్టి అతడు వికెట్ కీపింగ్ చేస్తాడని కచ్చితంగా చెప్పలేం. ప్రతి మ్యాచ్ ఆడతానని, కీపింగ్ చేస్తానని, 4వ స్థానంలో బ్యాటింగ్కు వస్తానని పంత్ చెబుతాడు’‘ అని రికీ తెలిపాడు. 14 మ్యాచ్లకు 10 ఆడినా చాలు మాకు బోనస్ అన్నారు.