కొన్ని చోట్ల రాత్రి, పగలు తేడా లేకుండా దోమలు కుడుతూ ఉంటాయి. దోమల నివారణకు ఎన్నో ప్రయోగాలు చేస్తాము. వీటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.! వాస్తవానికి దోమలు దేన్నీ చూడలేవు. ఎందుకంటే వాటికి కళ్లు ఉండవు. చెవులే కళ్లు, రెక్కలే చెవులుగా పని చేస్తాయి. వాటి సాయంతో అవి ఎదురుగా ఏముందో గ్రహిస్తాయట. దోమలు వాటి రెక్కల సాయంతో ఉత్పత్తి చేసే శబ్ద తరంగాలు అలలు అలలుగా ప్రయాణంచి, దారిలో ఏదైనా అడ్డం వస్తే అవి వెనక్కి వెళ్లి దోమను చేరతాయి. అలా దోమ తనకు దగ్గరలో ఏదో ఉన్నట్లు గ్రహిస్తాయి.