మన శరీరానికి నీరు తగినంత లేకపోతే.. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు. నీళ్లు సరిగ్గా తాగకపోతే.. తేలికపాటి నుంచి తీవ్రమైన అనేక ప్రతిచర్యలకు, శారీరక మార్పులకు లోనవుతుంది. డీహైడ్రేట్ అవుతారు, ఫోకస్ తగ్గుతుంది, త్వరగా అలసట వస్తుంది, జీర్ణ సమస్యలు ఎదురవుతాయి, మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది, చర్మ సమస్యలు ఎదురవుతాయి, రోగనిరోధక పనితీరుపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ డ్రింక్స్ తాగితే: పాలలో ట్రిఫ్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. తద్వారా ఒత్తిడి తగ్గిపోయి మంచి నిద్రకు కారణమవుతుంది. చమోమిలే టీలో ఎపిజెనిస్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది డిప్రెషన్‌ను దూరం చేసి మంచి నిద్రకు కారణమవుతుంది. అరటిపండ్లలో ఉండే మెగ్నీషియా, పోటాషియం కండరాలను, నరాలను రిలాక్స్ చేసి నిద్రను మీసొంతం చేస్తుంది. గ్రీన్ టీలో థయామిన్ అనే అమైనో యాసిడ్ ఉండడం వల్ల అది ఒత్తిడిని నివారించి మిమ్మల్ని రిలాక్స్‌గా ఉంచుతుంది.