ఎండుద్రాక్షలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల రక్తహీనత సమస్య పరిష్కారమవుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కిస్మిస్ తినడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలు, పేగు సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండు ద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేనివాళ్లు ఎండు ద్రాక్షను రోజూ తింటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.
మెంతులతో ప్రయోజనాలు: బాలింతలకు మెంతుకూర పప్పు, మెంతుకూర ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే గర్భిణులకు ప్రసవాన్ని సులభతరం చేస్తుంది. మెంతులతో గర్భాశయ వ్యాధులు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ తో బాధపడేవారు రోజుకు 10 నుంచి 20 గ్రాముల మెంతులను నీళ్లలో లేదా మజ్జిగలో కలిపి తీసుకుంటే కొవ్వు కరిగి లావు తగ్గుతారు. మధుమేహం ఉన్న వారు రోజుకు మూడు సార్లు మెంతులను తీసుకుంటే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.