చలికాలంలో ఎముకలు కొరికే చలిని తట్టుకోవాలన్నా, ఈ కాలం మోసుకొచ్చే వ్యాధులను ఎదిరించాలన్నా ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవాలి.ఈ కాలంలో కొన్ని డ్రింక్స్ తాగితే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో బాదం పాలు తాగితే బాదం పప్పులో ఉన్న పోషకాలు వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.అలాగే దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు గ్లాసుడు గోల్డెన్ మిల్క్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. శీతాకాలంలో హాట్ చాక్లెట్ తాగితే ఇది మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
పరగడుపున మొలకలు తింటున్నారా: ఉదయం లేవగానే మొలకలు తినడం నేడు సర్వసాధారణం అయిపోయింది. మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. మొలకలు ప్రతిరోజూ తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇవి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం కూడా ప్రమాదమేనట. ఈ పచ్చి మొలకల్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియా చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.