అవిసెలు.. ఈ చిన్న గింజలు ఎన్నో లాభాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, పైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. బరువు కంట్రోల్ అవుతుంది. శరీరబరువుని కంట్రోల్ చేసుకోవాలనుకునేవారు లంచ్, డిన్నర్ మధ్య ఒక చెంచా అవిసెలు తీసుకుంటే ఆకలి తగ్గి కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఎక్కువగా తీసుకోరు.
గుమ్మడి గింజలతో బరువు కంట్రోల్:
గుమ్మడి గింజల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల శరీర బరువు కంట్రోల్ అవుతుంది. ఎక్కువగా తినాలనే కోరికని తగ్గిస్తుంది. ఇందుకోసం రోజుకి రెండుసార్లు ఈ సీడ్స్‌ని తీసుకోవచ్చు. వీటిని రోస్ట్ చేసి తీసుకోండి. అయితే, నూనె వేయొద్దు.