టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఫోన్ చోరీకి గురైంది. కోల్కతాలోని తన నివాసానికి ప్రస్తుతం పెయింటింగ్ పని చేయిస్తున్నారు. తన ఫోన్ను ఇంట్లో పెట్టి బయటకు వెళ్లారు.
ఆయన తిరిగి వచ్చే సరికి అది మాయమైంది. ఇల్లు అంతా గాలించినా ఎక్కడా కనిపించలేదు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫోన్లో తన వ్యక్తిగత సమాచారం, కీలక డేటా ఉండడంతో ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.