దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.21 గంటల సమయంలో సెన్సెక్స్ 177 పాయింట్లు లాభపడి 72,000 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 48 పాయింట్లు పుంజుకొని 21,888 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో విప్రో, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.