దేశీయ టెక్నాలజీ ఇండస్ట్రీ అంచనాలకుమించి రాణిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి టెక్నాలజీ రంగ సంస్థల ఆదాయం 3.8 శాతం వృద్ధితో 254 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇండస్ట్రీ బాడీ నాస్కాం అంచనావేసింది. ఇదే సమయంలో 60వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని వార్షిక నివేదికలో పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇండస్ట్రీ 244.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన విషయం తెలిసిందే.