వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు వరుసగా రెండో రోజు పుంజుకున్నాయి. బీఎస్ఈలో సోమవారం ఐదు శాతం పెరిగి రూ.358.55 దగ్గర అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. జనవరి 31న పీపీబీఎల్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
తాజాగా ఆ గడువును మార్చి 15 వరకు పొడిగించింది. ఆర్బీఐ ఆంక్షల ప్రకటన తర్వాత కంపెనీ షేర్లలో పతనం కొనసాగుతూ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్‌తో ఒప్పందం నేపథ్యంలో కంపెనీ షేర్లు పుంజుకున్నాయి.