సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలతో దూకుడు మీదున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాంచీ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది.
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టాక వెన్ను నొప్పితో మైదానం వీడాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి డబుల్ సెంచరీ చేశాడు. కానీ నాలుగో ఇన్నింగ్స్ ఫీల్డింగ్ సమయంలో అసౌకర్యంగా కనిపించాడు. దీంతో అతనికి విశ్రాంతినిచ్చి ధర్మశాల టెస్టుకల్లా ఫిట్‌గా ఉంచేలా మేనేజ్మెంట్ ప్రయత్నాల చేస్తోందని తెలిసింది.