దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.21 గంటలకు సెన్సెక్స్ 159 పాయింట్లు నష్టపోయి 72,548 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు క్షీణించి 22,068 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ONGC లాభపడగా, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, HDFC లైఫ్ నష్టపోయాయి.