భారత ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట ఖాతాలు, పోస్ట్‌లపై చర్యలు తీసుకోవాలనిఆదేశాలు జారీ చేసిందని ప్రముఖ సోషల్ మీడియా సంస్థ X (సోషల్ మీడియా X) బుధవారం తెలిపింది. దీంతో వాటిని నిలిపివేశారు.
అయితే, అలాంటి చర్యలతో తాము విభేదిస్తున్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరూ తమ వేదికపై భావప్రకటన స్వేచ్ఛను కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తమ విధానాలకు అనుగుణంగా భారత ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ రిట్ అప్పీళ్లను దాఖలు చేసినట్లు సోషల్ మీడియా ఎక్స్ వెల్లడించింది.