దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 97 పాయింట్లు నష్టపోయి 22,115 వద్ద స్థిరపడగా.. సెన్సెక్స్ 354 పాయింట్లు దిగజారి 72,788 వద్ద ముగిసింది. L&T, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్ మినహా అన్ని స్టాక్స్ నష్టాల్లోకి ముగిశాయి. ఏషియన్ పెయింట్స్, టాటాస్టీల్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్స్‌గా మిగిలాయి.