న్యూజిలాండ్ వెటరన్ పేసర్ నీల్ వాగ్నర్ కీలక నిర్ణయం ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఫిబ్రవరి 29 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్ అనంతరం
వాగ్నర్ తప్పుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా వాగ్నర్ మాట్లాడుతూ. ‘బ్లాక్ క్యాప్స్ తరపున ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని, కివీస్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని' తెలిపాడు.