గర్భస్థ పిండం వయసును అత్యంత కచ్చితత్వంతో నిర్ధరించే ఒక కృత్రిమ మేధ(ఏఐ) సాధనాన్ని మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తలు రూపొందించారు.
ఇది నిర్దిష్టంగా భారతీయ అవసరాలకు ఉపయోగపడుతుందని, మూడు నెలలు పైబడిన పిండం వయసును లెక్కించడానికి సాయపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిశోధనలో ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కూడా పాలుపంచుకున్నారు.