దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 44 పాయింట్ల లాభంతో 73,140 వద్ద ఉంది. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 22,208 దగ్గర కొనసాగుతోంది.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90 వద్ద స్థిరంగా ఉంది. సెన్సెక్స్-30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, & ఇతర సంస్థలు షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో & ఇతర సంస్థలు నష్టాల్లో ఉన్నాయి.