ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 3-1 ఆధిక్యంతో దూసుకుపోయింది. చివరి మ్యాచ్ ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న టీమిండియా పేస్ బౌలర్ బుమ్రా చివరి మ్యాచ్‌లో ఆడనున్నాడు. ధర్మశాల పేసర్లకు స్వర్గధామం. ఈ క్రమంలో అతడితోపాటు మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇవ్వొచ్చు.
జస్ప్రీత్ బుమ్రా అభిమానులకు శుభవార్త ఏమిటంటే, అతను ధర్మశాల టెస్టుకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇది పేసర్లకు స్వర్గధామమైన పిచ్‌గా పేరుండటంతో బుమ్రా ఆడే అవకాశాలున్నాయి. పిచ్ పేసర్లకు సహకరిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఇరు జట్లు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.