నల్ల ద్రాక్షను తినడం వలన శరీరానికి సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. దీనికితోడు మలబద్ధకాన్ని నివారిస్తుంది. నల్ల ద్రాక్షను తీసుకోవడం మూలంగా గుండెకు మేలు చేయడంతో పాటు ఎసిడిటీ తగ్గిస్తుంది. ముఖ్యంగా జుట్టు సమస్యలను నివారించడంలో ప్రముఖ పాత్రను వహిస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అదేవిధంగా హైబీపీని అదుపులో ఉంచుతుంది.
రెడ్ రైస్ ఎందుకు తినాలో తెలుసా: చాలా మంది వైట్ రైస్‌నే మూడు పూటలా తింటుంటారు. కానీ వైట్ రైస్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే వైట్ రైస్ కంటే రెడ్ రైస్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. రెడ్ రైస్ తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. క్యాన్సర్‌ను నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. బరువును తగ్గించేందుకు సహాయం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.