హిందూ సంప్రదాయం ప్రకారం మన ఇళ్లల్లో కర్పూరం ఎక్కువగా వాడుతూ ఉంటాము. కర్పూరం ఉపయోగించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కర్పూరం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తుందట. మానవ అహంకారాన్ని నాశనం చేసే చిహ్నంగా నమ్ముతారు. కర్పూరం నీటితో మీ ముఖాన్ని క్రమం తప్పకుండా కడగడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించి, యవ్వనమైన చర్మాన్ని అందిస్తుంది.
రాగి పాత్రలోని నీళ్ళు తాగితే:
రాగి పాత్రలోని నీళ్ళు తాగితే పొందే అద్భుత ప్రయోజనాలు గురించి మనం తెలుసుకుందాం. రాగి పాత్రలో నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థకు ఎంతో మంచిది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వృద్ధాప్యం ఛాయలు కనబడకుండా చేస్తుంది. దైరాయిడ్ సమస్యలను కట్టడి చేస్తుంది. మెదడును చురుకుగా చేస్తుంది. మన శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కీళ్ళ నొప్పులు, వాపులు తగ్గించడంలో తోడ్పడుతుంది.