ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీ క్వాంటమ్ ఎనర్జీ తాజాగా బ్యాటరీ స్మార్ట్తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీల మార్పిడి(స్వాపింగ్) కోసం
25 పైచిలుకు నగరాల్లో 900 పైగా ఉన్న బ్యాటరీ స్మార్ట్ స్వాప్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని క్వాంటమ్ ఈ–స్కూటర్స్ డైరెక్టర్ సి.చేతన తెలిపారు. దీంతో యూజర్లు రెండు నిమిషాల్లోనే పూర్తిస్థాయిలో చార్జ్ అయిన బ్యాటరీలను పొందవచ్చని వివరించారు.